Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!

ఢిల్లీలో జనవరి 26న జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. ఈసారి ఏకంగా 41 మందికి ఆహ్వానం అందింది. మన్ కీ బాత్ లో పాల్గొన్న 15 మందితో పాటు కేంద్ర పథకాల లబ్ది పొందిన వారితో మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు.

New Update
 Delhi Republic Day Celebrations

Delhi Republic Day Celebrations 41 people selected from Telangana

Delhi Republic Day Celebrations: దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే తెలంగాణ అతిథుల లిస్ట్ ఖరారు అయింది. జనవరి 26న ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించబోయే రిపబ్లిక్ డే పరేడ్ కోసం హాజరయ్యే ప్రత్యేక గెస్టులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిస్తోంది. ప్రతి యేడాది పలు రాష్ట్రాల నుంచి కొంతమంది సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వ గౌరవిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ నుంచి ఏకంగా 41 మంది స్పెషల్ గెస్టులను ఆహ్వానించింది. 

కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు..

అలాగే ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారిని కూడా ఆహ్వానించింది. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఎంపికైన వారిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్నవారున్నారు. పీఎం యశస్వి పథకం, గ్రామీణ అభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ, టెక్స్‌టైల్ హస్తకళల, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ద్వారా జీవితంలో సెటిల్ అయిన వారున్నట్లు తెలుస్తోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న 15 మందితో కలిపి మొత్తం 41 మంది వేడుకలకు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్‌పై TGPSC కీలక నిర్ణయం!

అతిథుల లిస్ట్:

ప్రధానమంత్రి యశస్వి పథకం- 23 
టెక్స్‌టైల్స్ – 3 
వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ – 5 
గ్రామీణ అభివృద్ధి పథకాలు- 12 
పీఎం మత్స్య సంపద యోజన – 4 
గిరిజన వ్యవహారాల విభాగం – 7 
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ విభాగం – 1 (ఈ విభాగంలో శిక్షణ పొందిన అత్యుత్తమ ట్రైనీ శ్రావ్య).

ఇది కూడా చదవండి: ఎంతకు తెగించార్రా..  బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ టెలికాస్ట్

ఇక ఈ కార్యక్రమానికి పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అంకం రాజేశ్వర్, పీఎం జన్మన్, మహ్మద్ ఖాదీర్ అహ్మద్ తదితరులు కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యేడాది చీఫ్ గెస్టుగా ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు