Delhi: ఢిల్లీని మూసేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12 విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.

New Update
delhi fog

delhi fog

Delhi: ఉదయం పది దాటుతున్న ఢిల్లీలో సూర్యుడి జాడే కనిపించడం లేదు. వెలుతురుగా ఉన్నా ఎదుట మనిషి కనిపించడం లేదు. దీనికి కారణం విపరీతమైన పొగమంచు. ఢిల్లీలో ప్రతి సంవత్సరం శీతాకాలం వచ్చిందంటే చాలు చలిగా విపరీతంగా ఉంటుంది. ఈ ఏడాది కూడ ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.  సూర్యుడు రానా వద్దా అంటూ అలా కనిపిస్తున్నాడు. అయినప్పటికీ రోజంతా బాగా చలిగానే ఉంటోంది. దానికి తోడు ఉదయాల్లో పొగమంచు వల్ల ఎదురుగా ఏమి ఉంటుందో కనిపించడం లేదు.

Also Read: Viruska: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట!

మరో 100 ఫ్లైట్‌లు...

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12  విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా శుక్రవారం ఒక్కరోజే సుమారు 6  విమానాలు రద్దు అయ్యాయి. 100 ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీలో జీరో విజిబిలిటీ ఉండడమే దీనికి కారణం అని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 

Also Read: Global Warming: అత్యంత వేడి ఏడాదిగా 2024.. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు

అయితే నిన్నటి కంటే ఈరోజు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. విజిబిలిటీ కాస్త బెటర్‌‌గా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరో పక్క రైళ్ళు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు కారణంగా ఢిల్లీ వెళ్లే దాదాపు 50 కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, కర్నాల్‌ గాజియాబాద్‌ ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి కంటిన్యూ అవుతోంది. 

దీంతో చాలాచోట్ల ట్రాఫిక్‌ సమస్య  తలెత్తింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జనవరి 8 వ తేదీ వరకు దేశ రాజధానిలో పొగ మంచు ఇలానే ఉండే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 

Also Read: Sankranti 2025 Special Trains: చర్లపల్లి To వైజాగ్ మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణం!

Also Read: Sankranthi: మొదలైన సంక్రాంతి సందడి.. హైదరాబాద్- విజయవాడ రహదారిపై రద్దీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు