/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mobile-Phone-jpg.webp)
cheating
ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు డబ్బు కోసం ఎంతటి మోసానికి అయిన పాల్పడుతున్నారు. తాజాగా ఓ 23 ఏళ్ల యువకుడు అమెరికా మోడల్‌ను అంటూ ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 700 మంది అమ్మాయిలకు మోసం చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు ఢిల్లీలోని శకర్‌పుర్‌కు చెందిన తుషార్ బిస్త్ అనే యువకుడు బీబీఏ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరాడు.
ఇది కూడా చూడండి: TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
అమెరికా మోడల్ అంటూ.. ఫేక్ ప్రొఫైల్‌తో..
గత మూడేళ్ల నుంచి నొయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఓ యాప్ ద్వారా వర్చవల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ కొనుగోలు చేశాడు. దీంతో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. డేటింగ్ యాప్స్, స్నాప్ చాట్ వంటి వాటిలో పెట్టాడు. బ్రెజిల్‌కి చెందిన ఓ మోడల్ ఫొటోలను తన ఐడీలో అప్‌లోడ్ చేసుకునే వాడు. యంగ్ ఏజ్‌లో ఉన్న యువతలను టార్గెట్ చేసుకునే వాడు. ఫ్రీలాన్స్ మోడల్‌గా అమెరికాలో వర్క్ చేస్తున్నానని, భారత్‌కు త్వరలో వస్తానని ఆ యువతులను నమ్మించేవాడు.
ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి
వారికి బాగా దగ్గర అయ్యి.. పర్సనల్ ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు. వాటితో ఆ యువతులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా దాదాపుగా 700 మంది అమ్మాయిలను మోసం చేశాడు. బాధితుల్లో ఓ యువతి గతేడాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా పోలీసులు తుషార్‌ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు
ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!