Delhi: పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్

ఢిల్లీ స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపింది ఓ 12వ తరగతి కుర్రాడని తెలిసింది. కేవలం పరీక్షలు రాయడం ఇష్టం లేకనే బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడని తెలిసింది. ఈ స్టూడెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
delhi schools

రీసెంట్‌గా ఢిల్లీ (Delhi) లో వరుసగా 23 స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చాయి. దీంతో రెండు రోజుల పాటూ స్కూళ్ళను మూసేశారు. ఒకేనెలలో మూడు, నాలుగు సార్లు ఈ బెదిరింపులు రావడంతో అందరూ చాలా భయపడిపోయారు. డిసెంబర్ 24న జరిగిన ఈ సంఘటన మొత్తం ఢిల్లీని కుదిపేసింది. ఆప్ ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి.   

Also Read :  పొంగల్‌  దోపిడీ :  రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలు!

పరీక్షలు రాయడం ఇష్టం లేదు..

అయితే ఈ బాంబులు బెదిరింపులకు (Bomb Threat) పాల్పడింది ఎవరో కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది.  బాంబు బెదిరింపులు వచ్చిన స్కూల్స్‌లో ఓ 12వ తరగతి విద్యార్ధి తానే ఆ పని చేశాడని ఒప్పుకున్నాడు.  ఆపిల్లాడిని పోలీసలు అరెస్ట్ కూడా చేశారు. తరువాత జరిగిన విచారణలో విద్యార్ధి చెప్పిన నిజాన్ని విన్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. కేవలం అతనికి పరీక్షలు రాయడం ఇష్టం లేకనే ఈ మెయిల్స్ పంపానని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.  విద్యార్ధే ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించాడని పోలీసులు చెప్పారు. 

Also Read: USA: హమ్మయ్యా తప్పించేసుకున్నారు...ట్రంప్‌ కు బేషరతు విడుదల

విద్యార్ధి ఎంతో ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడని తెలుస్తోంది. ప్రతిసారీ అతడు.. తన సొంత పాఠశాలలను కాకుండా వేరే పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్‌ పంపించాడు. అనుమానం రాకుండా ఉండటానికి ఇలా చేసినట్టు పోలీసులు తెలిపారు. అతను ఒకసారి 23 పాఠశాలలకు మెయిల్ పంపాడని చెప్పారు. 

Also Read :  మెగా ఫ్యాన్స్కు బిగ్ షాక్‌.. భారీగా తగ్గిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్

Also Read :  కాల్చారా.. కాల్చుకున్నాడా.. ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి!

Advertisment
తాజా కథనాలు