/rtv/media/media_files/2025/05/03/nHqjcIeX2ZgIqq5vlHZ5.jpg)
AP Bhavan
AP Bhavan : దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ/ తెలంగాణ భవన్ కు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రాష్ట్రాల బిల్డింగ్‌ను పేల్చివేసి మట్టిలో కలిపేస్తామని దుండగులు ఈ మెయిల్ లో వార్నింగ్ ఇచ్చారు. భవన్‌లోని ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌కు మెయిల్ చేశాడు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ‘ఫూలే’ జీవితకథ ఆధారంగా నిర్మించిన సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ మెయిల్ వచ్చింది.
ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
శుక్రవారం రాత్రి ఈ మేరకు ఒక ఈమెయిల్ వచ్చిందని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం, ఆ సమయంలో ఏపీ భవన్ లో సీనియర్ అధికారులు ఉండటంతో అక్కడ టెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి ఏపీ భవన్ మొత్తం తనిఖీ చేయించారు. భవన్ పరిసరాలను డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసినా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
ఏపీ ప్రభుత్వం ప్రతి శుక్రవారం కేంద్రంలోని సీనియర్ ఉన్నతాధికారుల కోసం ఒక సినిమా ప్రదర్శిస్తున్నది. అందులో భాగంగా రాత్రి 8:30 కు ‘‘పూలే’’ సినిమా ప్రదర్శించారు. ఈ టైంలో బాంబు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తపై జాగిలాలతో తనిఖీలు చేసి ఏమి లేదని తేల్చారు. అయితే పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్, ఇండియా గేట్ కు కూత వేటు దూరంలో ఉన్న ఏపీ, తెలంగాణ భవన్ కు మెయిల్ రావడం భయభ్రాంతులకు దారితీసింది. బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు