AAP: కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్.. రెండుగా చీలిన ఆప్‌

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో ఈ పార్టీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. తమకు తాము ప్రత్యేక వర్గంగా ప్రకటించుకున్నారు.

New Update
Arvind Kejriwal

Arvind Kejriwal

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో ఈ పార్టీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. తమకు తాము ప్రత్యేక వర్గంగా ప్రకటించుకున్నారు. ఇంద్రప్రస్త వికాస్ పార్టీ పేరుతో ఈ రెండో వర్గం ఏర్పడినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 

రాజీనామా చేసిన రెబల్ కౌన్సిలర్లలో.. ముఖేష్ గోయల్, హేమంచంద్ గోయల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేష్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్, హిమానీ జైన్ ఉన్నారు. వీళ్లకు హేమచంద్‌ గోయల్‌ నాయకత్వం వహించనున్నారు. 

Also Read: శశిథరూర్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. ఆయనకు అవకాశం ఇవ్వకుండా..!

మూడు నెలల క్రితం ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. ఆ తర్వాత తాజాగా మరో 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పుడు వీళ్లు ఇంద్రప్రస్త వికాస్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఆప్‌ ఇలా రెండుగా వర్గాలుగా చీలిపోవడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

Also Read :  అటెండర్ను చెప్పుతో కొట్టిన మహిళా సీఐ-VIDEO VIRAL

ఎందుకు రాజీనామా చేశారంటే ? 

తాజాగా 13 మంది కౌన్సిలర్లు ఆప్‌కు ఎందుకు రాజీనామా చేశారో కారణాలు వెల్లడయ్యాయి. 2022లో ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వీళ్లందరూ ఆప్‌ టికెట్‌తో గెలిచారు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆప్‌ అగ్రననేతలు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను సరిగా నడిపించలేకపోయారని ఈ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. తమతో కనీసం సమన్వయం లేకుండా వ్యవహరించేవారని చెబుతున్నారు. అందుకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని కూడా అంటున్నారు. 

Also Read: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ.. కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ఛీఫ్ ముఫ్తీ

Also Read :  తుర్కియేకు భారత్ మరో గట్టి దెబ్బ.. రూ.770 కోట్లు లాస్

arvind-kejriwal | aap | delhi | rtv-news | telugu-news | aam-admi-party

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు