Celebi: భారత ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సెలెబీ సంస్థ

తుర్కియేతో ఉన్న సంబంధాలు అన్నీ భారత్ తెంచుకుంటోంది. ఇందులో భాగంగా తుర్కియే సంస్థ సెలెబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్ ను భారత్ రద్దు చేసింది. అయితే దీనిపై ఆ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీని వలన 3791 మంది ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

New Update
turcky

turkish-aviation-firm-celebi

భారత్‌ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల సమయంలో కొన్ని దేశాలు పాక్‌ కు బహిరంగ మద్దతునిచ్చాయి. అందులో టర్కి(తుర్కియే) ఒక్కటి. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియే కు భారత్‌ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్‌ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. అంతేకాక డ్రోన్లను అందించి మనదేశంపైకి ఉసిగొల్పింది. అయితే ఇప్పుడు ఆ దేశం తగిన శాస్తి అనుభవిస్తోంది. టూరిజంపై ఆధారపడిన తుర్కియేకు ఇండియా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం ఊపందుకుంది. దీంతో చాలా మంది టర్కీని బ్యాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా బ్యాన్ తుర్కియే ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జెఎన్యూ తో సహా మరికొన్ని యూనివర్శిటీలో టర్కీ యూనివర్శిటీతో ఉన్న సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. 

3791 ఉద్యోగాలు పోతాయి..

ఈ నేపథ్యంలో టర్కీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్ ఎయిర్ పోర్టుల్లో తుర్కియేకి చెందిన 'సెలెబీ గ్రౌండ్ హ్యాండ్లింగ్' సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ ను గురువారం రద్దు చేసింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. దీనిపై ఇప్పుడు సెలెబీ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర నిర్ణయాన్ని అక్కడ సవాల్ చేసింది. అస్పష్టమైన జాతీయ భద్రతా సమస్యలను హేతుబద్ధంగా ఉదహరించి తమ సంస్థ పై వేటు వేశారని వారు చెప్పారు. కేంద్రం నిర్ణయం వలన 3791 మంది ఉద్యోగాలు పోతాయని, పెట్టుబడి దారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని సెలబీ అంటోంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపింది. 

మరోవైపు తమది అసలు టర్కిష్ కంపెనీనే కాదని అంటోంది సెలబీ సంస్థ. తమకు ఏ విదేశీ ప్రభుత్వంతోనూ సంబంధాలు లేవని చెప్పింది. సెలెబి వ్యాపారం నిజంగా భారతీయ సంస్థ అని, దీనిని భారతీయ నిపుణులు నడిపిస్తారని, మేము ఏ ప్రమాణాల ప్రకారం చూసినా టర్కిష్ సంస్థ కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించబడిన కార్పొరేట్ పాలన, పారదర్శకత, తటస్థత పద్ధతులకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. 

 today-latest-news-in-telugu | delhi | Aviation

Also Read :  వేసవిలో ట్రావెల్ చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు