/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Arrest.jpg)
arrest
సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మకు ఢిల్లీ, రాజస్థాన్, హరియాణాలలో ఏడు కేసుల్లో అతడికి జీవిత ఖైదు పడగా.. గుడ్‌గావ్ న్యాయస్థానం మరణ దండన సైతం విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చింది. దీంతో అతను తీహార్ జైల్లో కొంతకాలంపాటూ శిక్ష అనుభవించాడు. తరువాత పెరోల్ మీద బయటకు వచ్చి అదృశ్యమయ్యాడు. దేవేందర్ 50కు పైగా హత్యలను చేశాడు. దేవేందర్ శర్మ, అతని అనుచరులు కార్లను బుక్ చేసుకొని డ్రైవర్లను చంపేసేవారు, ఆ తర్వాత ఆ కార్లను అమ్మేసేవారు. మృతదేహాలను హాజారా కాల్వలో మొసళ్లకు ఆహారంగా వేసి ఆధారాలను చెరిపివేసేవారు. ఇతనికి పదుల సంఖ్యలో హత్య, కిడ్నాప్, దోపిడీకి సంబంధించి సుదీర్ఘ నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు. 1998-2004 మధ్య అక్రమ కిడ్నీ రాకెట్ నిర్వహించి.. అనేక రాష్ట్రాల్లో పనిచేసే వైద్యులు, మధ్యవర్తుల సహాయంతో 125కి పైగా అక్రమ కిడ్నీ మార్పిడిలు చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
రెండు సార్లు అదృశ్యం..
అయితే తీహార్ జైల్లో శిక్ష పొందుతూ పెరోల్ మీ బయటకు వచ్చిన దేవేందర్ తరువాత అదృశ్యమయి పోయాడు. దీంతో అతనిని కనిపెట్టే బాధ్యత క్రైం బ్రాంచ్ కు అప్పగించారు. అప్పటి నుంచి పోలీసులు అలీగఢ్, జైపుర్, దిల్లీ, ఆగ్రా, ప్రయాగ్ రాజ్ సహా అనేక నగరాల్లో ఆరు నెలల పాటు ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. చివరకు దౌసాలోని ఓ ఆశ్రమంలో నకిలీ గుర్తింపుతో మారువేషంలో ఉన్న దేవేందర్ ను పట్టుకున్నామని ఢిల్లీ క్రైం బ్రాంచ్ డీసీపీ ఆదిత్య గౌతమ్ తెలిపారు. దేవేందర్ ఇలా పెరోల్ మీద బయటకు వచ్చి అదృశ్య కావడం మొదటి సారి కాదని పోలీసులు చెబుతున్నారు. 2020లో 20 రోజుల పెరోల్ గడువు ముగిసినా తిరిగి జైలుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఏడు నెలలకు పోలీసులకు ఢిల్లీలో పట్టుబడ్డాడు. ఆ తర్వాత 2023 జూన్‌లో సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులోదేవేందర్ కు రెండు నెలల పెరోల్ మంజూరు అయింది. అప్పుడు మళ్ళీ ఎవరికీ కనిపిచకుండా పోయాడు.
today-latest-news-in-telugu | delhi | Serial killer caught for rape