/rtv/media/media_files/2025/05/09/fRSExOvGR5AOWYA7Bc4k.jpg)
War Siren in Delhi
War Siren in Delhi: ఢిల్లీలో వార్ సైరన్ మోగింది. 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు సౌండ్ వినిపించేలా ఏర్పాట్లు చేశారు. వైమానిక దాడులు జరిగే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేలా ఇలా కీలక ప్రాంతాల్లో సైరన్లు మోగిస్తారు. ఈ నేపథ్యంలోనే సైరన్లు టెస్ట్ చేసేందుకు ఈరోజు వాటిని మోగించారు. ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది.
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
Also Read: ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!
ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్..
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దాడుల సమయంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేందుకే ఈ ఎయిర్ రైడ్స్ సైరన్ రిహార్సల్స్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ(India Pakistan War) పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు, దళాల కదలికలను కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు సూచించింది. '' భద్రతా దళాలు చేపట్టే ఆపరేషన్ల సమాచారాన్ని చేరవేస్తే వాళ్ల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుంది. గతంలో కార్గిగ్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజక్ ఘటనలు జరిగినప్పుడు కూడా మీడియా చూపించిన అత్యుత్సాహమే వీటికి నిదర్శనమని'' పేర్కొంది.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
rtv-news | delhi | india pakistan war