Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన పడటంతో సాకేంతిక సమస్య తలెత్తింది. దీంతో  227 మంది ప్రయాణికులతోకూడిన విమానాన్ని శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దించారు. వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

New Update
delhi

Delhi - Srinagar flight emergency landing for rain effect

Delhi: ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన పడటంతో పైలట్ అప్రమత్తం చేశాడు. దీంతో  227 మంది ప్రయాణికులతో విమానం శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దిగింది. భయంతో వణికిపోయిన ప్రయాణికుల వీడియో వైరల్ అవుతోంది. 

ఈ మేరకు VT-IMD రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఇండిగో విమానం 6E2142 శ్రీనగర్ సమీపిస్తున్న సమయంలో వడగళ్ల వాన కారణంగా తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంది. విమానం 227 మంది ప్రయాణికులు ఉండగా.. పైలట్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

దీంతో వివానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. 'సాయంత్రం 6:30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగింది. ప్రయాణికులందరూ, విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. ఇష్యూను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే పరిష్కరించాయి' అని అధికారి తెలిపారు.

 

 

 

 flight indigo | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు