Crime: పండగపూట విషాదాలు.. ఎంతమంది చనిపోయారంటే!
పండుగపూట ఏపీ, తెలంగాణలో విషాదాలు నెలకొన్నాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. బాణసంచా పేలి దంపతులు, పోలంలో ఓ రైతు చనిపోయారు. హైదరాబాద్ లో కూతురు తల్లిని కొట్టి చంపింది.
పండుగపూట ఏపీ, తెలంగాణలో విషాదాలు నెలకొన్నాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. బాణసంచా పేలి దంపతులు, పోలంలో ఓ రైతు చనిపోయారు. హైదరాబాద్ లో కూతురు తల్లిని కొట్టి చంపింది.
హైదరాబాద్ లోని కుకట్పల్లి డివిజన్లోని మాధవరం కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
విజయనగరంలో ఆస్తి కోసం ఓ కన్న కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తనకు దక్కదని అర్ధరాత్రి సమయంలో గునపంపై తండ్రి గుండెలపై గుద్ది గుద్ది దారుణంగా చంపాడు. చంపవద్దని తండ్రి కాళ్లు పట్టుకున్నా వినకుండా దారుణంగా చంపి పరారయ్యాడు.
కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి ఏకంగా ఫేస్బుక్ లైవ్‌లోనే ప్రకటించడం కలకలం రేపింది. హత్య తర్వాత భర్త ఇసాక్ (42) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని గొంతుకోసి చంపడం కలకలం రేపింది. ఆమె మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి స్నేహితుడి సాయంతో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునా నదిలో పడేశాడు.
బీహార్‌లో జరిగిన ఓ వివాదం మానవాళిని సిగ్గుపడేలా చేసింది. కేవలం ఐదు రూపాయల విషయంలో జరిగిన వివాదం చివరకు వృద్ధుడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మొహ్సీన్(60)బుధవారం సాయంత్రం ఎప్పటిలాగే కూరగాయలు అమ్మడానికి కాకో బజార్‌కు వచ్చాడు.
వనపర్తి జిల్లా రాయికల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయికల్ రైస్ మిల్ దగ్గర ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.