AP Crime: దుర్మార్గుడు.. చంపొద్దని కాళ్లు పట్టుకున్నా.. కన్న తండ్రిని గుండెలపై గుద్ది చంపిన కొడుకు!

విజయనగరంలో ఆస్తి కోసం ఓ కన్న కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తనకు దక్కదని అర్ధరాత్రి సమయంలో గునపంపై తండ్రి గుండెలపై గుద్ది గుద్ది దారుణంగా చంపాడు. చంపవద్దని తండ్రి కాళ్లు పట్టుకున్నా వినకుండా దారుణంగా చంపి పరారయ్యాడు.

New Update
Murder

Murder

నేటి కాలంలో తండ్రి, బంధువు, తల్లి వంటి సంబంధాలు చూడకుండా అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరంలోనూ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో పెదమజ్జి నాయుడు(72), ఆయన కొడుకు గణేష్‌ ఉంటున్నాడు. అయితే వీరి మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి. ఆస్తి కోసం కొడుకు తండ్రి కాలు విరగొట్టాడు. దీంతో చికిత్స కోసం తండ్రి భూమిని అమ్మకానికి పెట్టాడు. అయితే తండ్రి అడ్డు తప్పిస్తేనే భూమి దక్కుతుందని కొడుకు గణేష్ అనుకున్నాడు. ఈ క్రమంలోనే గణేష్ అర్ధరాత్రి సమయంలో గునపంపై తండ్రి గుండెలపై గుద్ది గుద్ది దారుణంగా చంపాడు. చంపవద్దని తండ్రి కాళ్లు పట్టుకున్నా గణేష్ వినలేదు. తండ్రిని దారుణంగా చంపి ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పారిపోయిన గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Raipur Steel Plant Collapses: కుప్పకూలిన స్టీల్ ప్లాంట్.. ఐదుగురు కార్మికుల దుర్మరణం!

శ్రీకాకుళంలోనూ ఇలాంటి..

ఇదిలా ఉండగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంత్రకోట కూడలి వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మద్యం సేవించిన లారీ డ్రైవర్ ఒకరు దాబా యజమానిని, పాలు సరఫరా చేసే వ్యక్తిని తన వాహనంతో ఢీకొని చంపినట్లు సమాచారం. సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన లారీ డ్రైవర్ ఇబ్రార్ ఖాన్ జలంత్రకోటలోని న్యూ స్టార్ దాబాలో భోజనానికి ఆగాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న ఇబ్రార్, పక్కనే ఉన్న సోంపేట మండలం సంధికొట్టూరుకు చెందిన యువకుడితో ఘర్షణకు దిగాడు. దాబా యజమాని మహమ్మద్ అయూబ్ (55) జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశాడు. దాంతో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇది కూడా చూడండి: TG News: హైదరాబాద్‌లో పోకిరీల అరాచకం.. పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్‌ను ఆపి.. కాళ్లు మొక్కించుకుని..!

భోజనం ముగించుకుని డ్రైవర్ లారీతో బయలుదేరుతుండగా.. అయూబ్ అతన్ని ఆపి, చెల్లించాల్సిన రూ. 200 బిల్లు ఇవ్వమని అడిగాడు. అయితే.. డ్రైవర్ ఇబ్రార్ ఖాన్ తన లారీతో అయూబ్‌ను ఢీకొట్టాడు. దాబాకు పాలు సరఫరా చేసే మడుపురం గ్రామానికి చెందిన దొక్కర దండసి (66) కూడా డ్రైవర్‌ను ఆపడానికి ప్రయత్నించగా.. లారీ అతడిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అయూబ్, దండసి ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. లారీ డ్రైవర్ ఆగకుండా వెళ్తుండటంతో.. స్థానికులు తమ వాహనాలలో అతన్ని వెంబడించి రెండు కిలోమీటర్ల దూరంలో పట్టుకున్నారు. డ్రైవర్ ఇబ్రార్ ఖాన్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు