/rtv/media/media_files/2025/09/21/man-murders-girlfriend-in-uttar-pradesh-2025-09-21-18-24-11.jpg)
Man Murders Girlfriend In Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని గొంతుకోసి చంపడం కలకలం రేపింది. ఆమె మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి స్నేహితుడి సాయంతో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునా నదిలో పడేశాడు. కూతురు కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లో ఆకాంక్ష అనే యువతి తన అక్క ప్రతీక్షతో కలిసి చదువుకుంటోంది. అలాగే బర్రాలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. దీంతో ఆ రెస్టారెంట్‌లో పనిచేసే ఫతేపుర్‌కు చెందిన సూరజ్ కుమార్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది.
Also Read: గాజుల రామారంలో హైడ్రా ఆఫరేషన్.. కబ్జాల నుంచి 300 ఎకరాలకు విముక్తి
కొన్నిరోజులకే వాళ్ల పరిచయం ప్రేమగా మారింది. సూరజ్ ఒత్తిడి వల్ల ఆకాంక్ష బర్రాలోని రెస్టారెంట్‌లో పనిచేయడం మానేసింది. ఆ తర్వాత హమీపుర్ రోడ్‌లోని మరో రెస్టారెంట్‌లో పనిలో చేరింది. ఈ క్రమంలోనే రెండు నెలల నుంచి ఆమె తన అక్కను వదిలేసి సూరజ్‌తో కలిసి హనుమంత్ విహార్‌లో ఉంటోంది. రోజూ తన అక్క, తల్లితో ఫోన్‌లో మాట్లాడేది. అయితే కొన్నిరోజులుగా ఆకాంక్ష ఫోన్‌కాల్స్ వాళ్లకు రావడం లేదు. అలాగే వాళ్లు ఫోన్ చేసిన సమాధానం రావట్లేదు. దీంతో ఆకాంక్ష తల్లికి అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆకాంక్ష ఆచూకి కోసం రంగంలోకి దిగారు.
Also Read: కబడ్డీ కోర్టులో విషాదం.. కరెంట్ వైర్ తెగిపడి స్పాట్‌లోనే ముగ్గురు!
చివరికి శనివారం పోలీసులు సూరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆకాంక్షతో పాటు అతడికి ఇంకో మహిళతో పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒకరోజు ఆకాంక్ష వాళ్లిద్దరి వాట్సాప్ చాట్ చూసింది. దీంతో సూరజ్, ఆకాంక్ష మధ్య గొడవ జరిగింది. సూరజ్ ఆమెను ఒప్పించేందుకు యత్నించగా ఆమె నిరాకరించింది. జులై 21న రాత్రి వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అతడు ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునా నదిలో పారేశారు.
ఈ దారుణ ఘటనపై అక్కడి సౌత్ జోన్ డీసీపీ దీపేంద్రనాథ్ చౌదరి కూడా మాట్లాడారు. సూరజ్‌ను , అతడి స్నేహితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణ చేసిన మొదట్లో సూరజ్ కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నించినట్లు తెలిపారు. చివరికి ఫోన్‌లో కాల్ రికార్డింగ్స్ ఆధారంగా అతడు హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ప్రేమించిన అమ్మాయిని ఆమె లవర్ గొంతు కోసి చంపడం స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: లోన్ యాప్ లో అప్పులు..ఆడవేశంలో వచ్చి స్నేహితుడి ఇంటికే కన్నం