Kerala: భార్యను చంపి.. ఫేస్‌బుక్‌లో లైవ్ చేసిన భర్త

కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి ఏకంగా ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే ప్రకటించడం కలకలం రేపింది. హత్య తర్వాత భర్త ఇసాక్ (42) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

New Update
Kerala Man Stabs Wife To Death, Announces Murder On Facebook Live

Kerala Man Stabs Wife To Death, Announces Murder On Facebook Live

కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి ఏకంగా ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే ప్రకటించడం కలకలం రేపింది. హత్య తర్వాత భర్త ఇసాక్ (42) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలిని కొల్లం జిల్లాకు చెందిన శాలిని(39)గా పోలీసులు గుర్తించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. గల్ఫ్‌ నుంచి తిరిగొచ్చిన ఇసాక్‌ రబ్బర్‌ ట్యాప్పర్‌గా పనిచేస్తున్నాడు.  అతడు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోకనే భార్య శాలిని పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తోంది. 

Also Read: నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!

ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నిరోజుల నుంచి శాలిని, ఇసాక్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే సోమవారం ఉదయం 6.30 గంటలకు శాలిని కిచెన్‌ వెనుకున్న పైప్‌లైన్‌ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇసాక్‌ ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మెడ, ఛాతీ, వీపుపై శాలినీకి తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఇసాక్ ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి తన భార్యను చంపేసినట్లు వివరించాడు.  

Also Read: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్

శాలిని ఎప్పుడూ కూడా తన మాటలు వినలేదని.. తన తల్లితోనే ఉండేందుకు వెళ్లిందని ఆరోపణలు చేశాడు. చివరికి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యను ఇలా చంపేసి ఫేస్‌బుక్‌ లైవ్ చేయడంతో ఈ ఘటన దుమారం రేపింది. ఇసాక్‌ కూడా పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. 

Also Read: అమెరికాలో హనుమంతుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ట్రంప్ పార్టీ నాయకుడే!

Advertisment
తాజా కథనాలు