/rtv/media/media_files/2025/09/21/court-judgement-2025-09-21-19-34-48.jpg)
Court Judgement
ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. శనివారం దీనిపై సుదీర్ఘ విచారణ జరగగా.. డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరి (FSL) రిపోర్టుల ఆధారంగా నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ తీర్పు అనేక మంది నేరగాళ్లపై ప్రభావం చూపిస్తుందని కోర్టు పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. లఖింపుర్ ఖేరీ జిల్లాలో మొహమ్మదీ కొట్ వాలీ పరిధిలో బీచ్ పారీ అనే గ్రామంలో రామ్‌వీర్ సింగ్ (28) అనే వ్యక్తి.. తన తల్లితో కలిసి ఉంటున్నాడు. 2020 అక్టోబర్ 28న అతడు తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Also Read: ఓరి పాపిస్టోడా.. టెస్ట్ డ్రైవంటూ బైక్‌తో పారిపోయావ్ కదరా..! (వీడియో)
ఈ ఘటనపై నిందితుడి మేనల్లుడు కరణ్‌సింగ్.. రామ్‌వీర్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామ్‌వీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి 9 మంది సాక్ష్యం చెప్పారు. అలాగే డీఎన్‌ఏ, ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్టుల్లో కూడా కొడుకే అత్యాచారం చేసినట్లు తేలింది. వీటిని బలమైన ఆధారాలుగా భావించిన కోర్టు రామ్‌వీర్ సింగ్‌ను దోషిగా తేల్చింది. అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.
ఇది సాధారణ నేరం కాదని.. సమాజమే వ్యతిరేకించే చర్య అని బాధితురాలి తరఫున ADGC క్రిమినల్ న్యాయవాది సందీప్ మిశ్రా ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు చేశారు. ఆయన డీఎన్‌ఏ, ఎఫ్‌ఎస్‌ఎల్ దర్యాప్తు రిపోర్టును ఆయన కీలక ఆధారాలుగా కోర్టులో సమర్పించారు. ఒక కొడుకు తల్లిపై ఇలాంటి నేరం చేయడం సమాజాన్ని కుదిపేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Also Read: సడెన్ గా హెచ్ 1-బీ వీసాల ఫీజు పెంపు ఎందుకు? భారత్, చైనాల పై ఒత్తిడి కోసమేనా?