Bihar : రూ.5 కోసం దారుణ హత్య.. వృద్ధుడిని పిడిగుద్దులు గుద్ది

బీహార్‌లో జరిగిన ఓ వివాదం మానవాళిని సిగ్గుపడేలా చేసింది.  కేవలం ఐదు రూపాయల  విషయంలో జరిగిన వివాదం చివరకు  వృద్ధుడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మొహ్సీన్‌(60)బుధవారం సాయంత్రం ఎప్పటిలాగే కూరగాయలు అమ్మడానికి కాకో బజార్‌కు వచ్చాడు.

New Update
5

బీహార్‌లో జరిగిన ఓ వివాదం మానవాళిని సిగ్గుపడేలా చేసింది.  కేవలం ఐదు రూపాయల  విషయంలో జరిగిన వివాదం చివరకు  వృద్ధుడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మొహ్సీన్‌(60)బుధవారం సాయంత్రం ఎప్పటిలాగే కూరగాయలు అమ్మడానికి కాకో బజార్‌కు వచ్చాడు. ఈ సమయంలో, విక్కీ పటేల్ కూరగాయలు కొనుక్కోవడానికి అతని వద్దకు వచ్చాడు. విక్కీ పటేల్ రూ.15కు కూరగాయలు కొనుగోలు చేసి రూ.10 ఇవ్వగా మిగతా రూ.5 ఇవ్వాలని మహ్సీన్ అడిగాడు. ఇది కాస్త వివాదంగా మారింది. దీంతో కోపంలో విక్కీ పటేల్ మొదట బాధితుడిని తన్ని ఆపై  కొట్టి, ఆపై కర్రతో ఛాతీపై కొట్టాడు. దీంతో  మొహమ్మద్ అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిపై కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం ఆందోళనకు దిగారు.  

రూ.2 లక్షల ఆర్థిక సహాయం

మృతుడు మొహమ్మద్ మొహ్సిన్ కాకో పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పఖాన్‌పురా గ్రామంలో నివసించేవాడు. అతను చాలా మంచివాడని,  అతను ప్రతిరోజూ తన పొలం నుండి మార్కెట్‌కు కూరగాయలు తీసుకువచ్చి అమ్ముకునేవాడని స్థానికులు చెబుతున్నారు.  అతని మరణం తరువాత కోపంతో ఉన్న ఒక గుంపు NH-33ని దిగ్బంధించింది. దీంతో  దాదాపు మూడు గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వందలాది వాహనాలు ట్రాఫిక్  జామ్‌లో చిక్కుకున్నాయి.  మృతుడి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు (శక్తి యోజన) కింద రూ.2 లక్షల ఆర్థిక సహాయం, రూ.20,000 తక్షణ సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, విక్కీ పటేల్ తరచుగా రాజకీయ ప్రోత్సాహాన్ని ఉపయోగించి దోపిడీ,  బెదిరింపులకు పాల్పడేవాడని తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకులతో ఆయన ఉన్న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విక్కీ పటేల్ పై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,  

Advertisment
తాజా కథనాలు