/rtv/media/media_files/2025/09/18/wanaparthy-crime-news-2025-09-18-11-13-52.jpg)
Wanaparthy Crime News
TG Crime: వనపర్తి జిల్లా రాయికల్ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాయికల్ రైస్ మిల్ దగ్గర ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ..
ఈ ప్రమాదంలో మృతి చెందినవారిని వనపర్తి జిల్లాకు చెందిన రాజు, రవిగా పోలీసులు గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
https://x.com/TeluguScribe/status/1968528778864509200
ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. రూ.50 వేలు అప్పిచ్చి ఆత్మహత్య చేసుకున్న భార్య, కొడుకు
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతివేగంగా వాహనాలను నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా వనపర్తి-రాయికల్ మార్గంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
ఇది కూడా చదవండి: నెల్లూరులో ఘోరం.. ఏడేళ్ల బాలుడిని గొంతు నులిమి.. చంపింది వాళ్లేనా?