/rtv/media/media_files/2025/09/30/crm-2025-09-30-19-38-11.jpg)
Crimes: పండుగపూట ఏపీ, తెలంగాణలో విషాదాలు నెలకొన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని కిరణా షాపులో బాణాసంచా పేలి భార్యాభర్తల మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు శ్రీనివాసరావు (50), సీతామహాలక్ష్మి (48)గా గుర్తించారు. గాయపడిన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోనే కిరణా షాప్ నిర్వహిస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి మందు గుండు సామాగ్రి పేలినట్లు పోలీసులు గుర్తించారు.
ఆటో లారీ ఢీ..
కర్నూలు జిల్లా పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు చనిపోయారు. మృతులు ముకెల గ్రామానికి చెందిన భూమిక (26), నితిక (5), తల్లీకూతుళ్లతోపాటు శిరీష (30)గా గుర్తించారు. ముగ్గురు కలిసి మరో ఊరికి వెళ్లేందుకు ఆటోస్టాండ్ వద్ద ఆటోలో కూర్చోగా అటువైపుగా బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్నేహితుడిని చంపిన యువకులు..
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దారుణం జరిగింది. స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు చనిపోవడం కలకలం రేపుతోంది. యాదగిరి అనే వ్యక్తిని అఫ్రోజ్, నవాజ్ అనే ఇద్దరు కత్తితో పొడిచి హతమార్చారు. కలిసి మద్యం తాగిన ఈ ముగ్గురి మధ్య గొడవ జరగడంతో యాదగిరిని పొడిచి చంపేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫోన్ చేయగా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: పొద్దున్నే ఇలా చేయండి.. మొటిమలు.. మచ్చలను తగ్గించుకోండి
తల్లిని హతమార్చిన కూతురు..
హైదరాబాద్ లీలానగర్‌లో అమానుష ఘటన జరిగింది. ఓ కూతురు తనను కనిపెంచిన తల్లినే కడతేర్చింది. సోమవారం రాత్రి లక్ష్మి (82)ని ఇనుపరాడ్డుతో కొట్టి చంపింది మాధవి(42). తల్లి లక్ష్మితో వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి పాల్పడగా కుమార్తె మాధవికి మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: బాదం ఆరోగ్యకరమే కానీ.. వాటితో తింటేనే ప్రమాదం!!
ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్‌కు చెందిన రాకేష్(22), పూదరి రోహిత్ (22) స్నేహితుడు పాపాని ఆదర్శ్ (22)కు కడుపునోప్పి రావడంతో మోటార్ సైకిల్‌పై ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న రఘు అనే వ్యక్తి అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో రాకేష్, రోహిత్, ఆదర్శ్, రఘు నలుగురికి తీవ్ర గాయాలవగా అయ్యాయి. రాకేష్, రోహిత్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మిగతా ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
పొలంలో రైతు మృతి..
మహబూబ్ నటర్ మిడ్జిల్ మండలంలో రైతు మృతిచెందడం విషాదాన్ని నింపింది. పొలంలో మందు పిచికారి చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి రావుల బాలస్వామి(38) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక సంఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించి పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.