/rtv/media/media_files/2025/09/29/hyderabad-crime-news-2025-09-29-20-46-24.jpg)
Hyderabad Crime News
బతుకమ్మ అంటే ప్రకృతిని, గౌరీ దేవిని ఆరాధిస్తుందచే పండుగ. ఇది వర్షాకాలం చివరిలో.. చెరువులు నిండిన సమయంలో వస్తుంది. తెలంగాణ మహిళలు రకరకాల కాలానుగుణమైన పూలతో ఏడు నుంచి తొమ్మిది పొరల్లో గోపురం ఆకారంలో బతుకమ్మను పేర్చి దానిపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటారు. చివరి రోజు.. సద్దుల బతుకమ్మ నాడు దీనిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ స్త్రీల శక్తికి, ఐక్యతకు చిహ్నంగా చెబుతారు. అయితే తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ బతుకమ్మ పండుగలో విషాదం టు చేసుకుంది.
హైటెన్షన్ తీగలే తగిలి:
తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కుకట్‌పల్లి డివిజన్‌లోని మాధవరం కాలనీలో బతుకమ్మ వేడుకల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా పేర్చిన బతుకమ్మను తీసుకెళ్తున్నప్పుడు అది హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
హయత్‌నగర్‌లో వ్యక్తి మృతి:
ఇది కూడా చదవండి: అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు.. బట్టలు చింపి దాడి చేసిన మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే..
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్లో మరొక దుర్ఘటన జరిగింది. బతుకమ్మ పూల కోసం వెళ్లిన అశోక్ రెడ్డి అనే వ్యక్తి సెప్టిక్ ట్యాంక్‌లో పడి దుర్మరణం చెందాడు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక అతడు మరణించినట్లు తెలుస్తోంది. అశోక్ రెడ్డి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. సెప్టిక్ ట్యాంక్ దగ్గర విషాదకర దృశ్యం కనిపించింది. సమాచారం అందుకున్న హైడ్రా డిజాస్టర్ టీం అశోక్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీసింది. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం శేర్‌గూడకు చెందిన అశోక్ రెడ్డి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా హయత్‌నగర్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో నివసిస్తున్నాడు.ఈ రెండు ఘటనలు బతుకమ్మ పండుగ వేళ ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పండుగ పూట పెను విషాదం.. నల్గొండలో ముగ్గురు స్పాట్ డెడ్!