Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
బీహార్ ఎన్నికలకు ఒకరోజు ముందు దేశ రాజధానిలో బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు.
బీహార్ ఎన్నికలకు ఒకరోజు ముందు దేశ రాజధానిలో బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్ వద్ద పాక్ కాల్పులకు పాల్పడింది. ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ బలగాలు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
BSF జవాన్లకు అధునాతన బాడీ-వోర్న్ కెమెరాలను ఇస్తున్నారు. ఈ కెమెరాలు జవాన్ల యూనిఫామ్లకు అమర్చబడి, సరిహద్దుల్లో జరిగే ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాయి. బంగ్లాదేశ్, పాక్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న BSF జవాన్లకు 5వేలకు పైగా కెమెరాలను అందిస్తున్నారు.
థాయిలాండ్-కంబోడియా మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు.. కొన్ని శతాబ్దాల కిందట నుంచి ఈ సరిహద్దు వివాదం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ప్రెహ్ విహియర్ హిందూ దేవాలయం, దాని చుట్టూ ఉన్న భూభాగం వల్ల ఈ గొడవలు అప్పట్లో మొదలైంది.
పాక్, అఫ్ఘన్ సరిహద్దులో గురువారం రెండు సార్లు కాల్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ బర్మాచా సరిహద్దు ప్రాంతంలో ఇరువర్గాలు పరస్పరం భారీ కాల్పులు జరపడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దులో కొత్త పోస్టుల నిర్మాణం కారణంగా ఈ వివాదం తలెత్తింది.
పాక్ తన పౌరులను నేపాల్ ద్వారా భారత్కు పంపిస్తుందని సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే భద్రతా బలగాలు బోర్డర్లో హై అలర్ట్ విధించారు. నేపాల్ నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు.
పాక్ ఆర్మీ LoC వద్ద కాల్పులు చేపట్టగా భారత్ సైన్యం వాటికి దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.
భారతదేశం, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సరిహద్దు రాష్ర్టాలైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో హైఅలర్ట్ ప్రకటించింది. పోలీసులు, ఇతర పాలనాధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశారు.