Air Force: రేపు డ్రిల్ ఒకవైపు..సరిహద్దులో వాయుసేన భారీ విన్యాసాలు మరోవైపు

రేపు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ లోని అంతర్జాతీయ సరిహద్దులో భారత వాయుసేన కూడా భారీ విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఐదున్నర గంటలపాటూ వీటిని చేయనుంది వాయుసేన.

author-image
By Manogna alamuru
New Update
Rafale jets

Rafale jets

పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉగ్రదాడికి కారణం పాకిస్తాన్ అని భారత్ ఆరోపిస్తుంటే..తమ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆ దేశం అంటోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. రేపూ మాపో వార్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఇరు దేశాలూ ఇప్పటికే అన్ని రకాలుగా యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ఆర్మీ, వెపన్స్ సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఇంక కలబడ్డమే ఆలస్యం అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మే 7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ ను నిర్వహించాలని ఆదేశించింది. 

ఐదున్నర గంటలపాటూ విన్యాసాలు..

ఇదే సమయంలో భారత వాయుసేన (IAF) కూడా రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో భారీస్థాయిలో విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో రఫేల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో ప్రదర్శన చేయనున్నారు. దాదాపు ఐదున్నర గంటల పాటూ ఈ విన్యాసాలు కొనసాగుతాయని వాయుసేన అధికారులు తెలిపారు. దీని కారణంగా సరిహద్దు ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. 

అసలేంటీ మాక్ డ్రిల్..

యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఎలా ఉండాలి. వారు అప్రమత్తంగా ఉండడానికి ఏం చేయాలి అన్న విషయాలను చెప్పడమే మాక్ డ్రిల్. యుద్ధం వస్తే దీన్ని ఎలా ఎదుర్కొవాల్సి ఉంటుందనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించాల్సి ఉంటుంది అనే దానిని ఇందులో చెప్పనున్నారు. శత్రువులు అటాక్ చేసినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అత్యవసర పరిస్థితుల్లో ఏ యాక్ష్ తీసుకోవాలి..తమను తాము రక్షించుకుంటూనే 
కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి..యుద్ధంలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు ఎలా తరలించాలి..అలాంట వారిని తరలించడానికి ఎటువంటి రవాణా అందుబాటులో ఉంచాలి.. అనే అంశాలపై ఆ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
అంతేకాకుండా వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయడం, వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ లింక్‌ల నిర్వహణ, కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానం కావడం, దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడం, క్రాష్ బ్లాక్ అవుట్‌లో ఎలా వ్యవహరించాలి, అగ్నిమాపక- రెస్క్యూ ఆపరేషన్లల్లో ఎలా పాల్గొనాలి, దాడి సమయంలో ప్రజలను ఖాళీ చేయించే ఏర్పాట్లను సమీక్షించడం వంటివి కూడా ఇందులో నేర్పించనున్నారు. 

today-latest-news-in-telugu | air-force | exercises | border 

Also Read: PM Modi: సింధు జలాలు భారత్ వే..ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు