/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Indian-Border-jpg.webp)
India Pak
పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్‌కు వరుస షాక్‌లు ఇచ్చింది. దేశంలో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ పౌరులు దేశంలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ మరో కుట్రకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అనుమానితులను నేపాల్ ద్వారా భారత్‌కు పంపాలని దాయాది దేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
Bahraich, Uttar Pradesh: 42nd Battalion Commandant Ganga Singh says, "The situation is tense between Pakistan and India, so our soldiers remain alert 24x7 to face any challenge. We received intel about 35-37 people entering Nepal from Bangladesh, planning to infiltrate India with… pic.twitter.com/LO9g4IYdkP
— IANS (@ians_india) May 21, 2025
ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
సరిహద్దుల్లో హై అలర్ట్..
సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. అలాగే అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టడం ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాలు అన్నింటిలో హైఅలర్ట్ విధించారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అడవులలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. నేపల్ నుంచి వచ్చే ప్రతీ పౌరుడిని కూడా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
❗️HIGH ALERT: Infiltrators Exploring Nepalese Border Route - India Deploys Armed Police (Report)
— RT_India (@RT_India_news) May 21, 2025
A tip-off has seen security and combing operations stepped up at India's frontier with Nepal, after intel had suggested dozens of Bangladeshi and Pakistani infiltrators were… pic.twitter.com/MZlPCAZYyi