/rtv/media/media_files/2025/07/27/body-cameras-for-bsf-2025-07-27-20-26-20.jpg)
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తన కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు అధునాతన బాడీ-వోర్న్ కెమెరాలను సమకూర్చుకుంటోంది. ఈ కెమెరాలు జవాన్ల యూనిఫామ్‌లకు అమర్చబడి, సరిహద్దుల్లో జరిగే ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాయి. బంగ్లాదేశ్, పాక్ సరిహద్దుల వెంట విధులు నిర్వర్తిస్తున్న BSF దళాలకు 5,000 పైగా బాడీ కెమెరాలను అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2,500 కెమెరాలను పంపిణీ చేయగా, మరో 2,500 కెమెరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కెమెరాలు రాత్రిపూట కూడా స్పష్టంగా రికార్డు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి సుమారు 12-14 గంటల ఫుటేజ్‌ను నిల్వ చేయగలవు.
Must have shot them.
— JSR 🛕 🇮🇳 ⚔ (@JS02Hyd) June 3, 2025
Are We playing with security.??
Well threated by BSF jawan.
They shd have body mounted cameras, for their recording the threat incident for record keeping
Shooting, shd be sole discretion of BSF at the post !!
సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, పశువుల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్ల చలామణి, మానవ అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే, అక్రమ బంగ్లాదేశీయులను దేశం నుంచి పంపించేటప్పుడు, లేదా నేరగాళ్లతో BSF జవాన్లకు ఎదురయ్యే సంఘటనలను రికార్డు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. భద్రతా దళాలపై జరిగే దాడులకు సంబంధించి ఆధారాలను సేకరించడంలో కూడా ఈ రికార్డింగ్‌లు సహాయపడతాయి. ఈ నిర్ణయం, ముఖ్యంగా సరిహద్దులో భద్రతను పటిష్టం చేయడంలో హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న సమీక్ష తర్వాత వెలువడింది.
body cameras | border | Ministry of Home Affairs | Border Security Force | latest-telugu-news