India-Pakistan: బోర్డర్‌లో హైటెన్షన్.. భారత్, పాక్ మధ్య మళ్లీ కాల్పులు!

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్ వద్ద పాక్ కాల్పులకు పాల్పడింది. ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్ బలగాలు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్ వద్ద పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్ బలగాలు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే వీటిని భారత సైన్యం ఈజీగా తిప్పికొట్టినట్లు తెలిపింది. గంటపాటు ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే దీనిపై భారత సైన్యం అధికారిక ప్రకటన చేయలేదు. 

ఇది కూడా చూడండి: H-1B వీసాలపై ట్రంప్ నిర్ణయంతో తెలంగాణకు ఎంత నష్టమంటే?: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

ఇది కూడా చూడండి: ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!

Advertisment
తాజా కథనాలు