Operation Sindoor : సరిహద్దు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు.. వారికి సెలవులు రద్దు

భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సరిహద్దు రాష్ర్టాలైన  జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. పోలీసులు, ఇతర పాలనాధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశారు.

New Update

Operation Sindoor : భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సరిహద్దు రాష్ట్రాలైన  జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎటువంటి పరిస్థితినైన ఎదుర్కొవడానికి అవసరమైన భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, ఇతర పాలనాధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశారు.  అంతేకాదు సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

పాక్‌ వెంట సరిహద్దు కలిగి ఉన్న గుజరాత్‌ సముద్రతీరం వెంట కోస్ట్ గార్డ్స్‌   పహారను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయా సరిహద్దు రాష్ట్రాల్లోని  పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులును కూడా రద్దు చేశారు. అటు  హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భద్రతను భారీగా పెంచారు. హమీపుర్‌, ఉనా, బిలాస్‌పుర్‌ తదితర ప్రాంతాల్లో  భద్రతా దళాలు మోహరించాయి. అలాగే దేశంలోని  ప్రముఖ దేవాలయాల దగ్గర భద్రతను పెంచడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేశారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు వదిలి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు మినహా ఇతర ప్రయాణాలు పూర్తిగా రద్దు చేసుకోవాలని పోలీసులు సూచించారు. 
ఇక సరిహద్దులో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  అక్కడి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలీసులు, వైద్యులు ఇతర అత్యవసర సిబ్బది సెలవులను పూర్తిగా రద్దు చేశారు. అదే సమయంలో… స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  జమ్ము కాశ్మీర్ తో పాటు అస్సాం, రాజస్థాన్, పంజాబ్, హర్యానా అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Advertisment
తాజా కథనాలు