/rtv/media/media_files/2025/11/11/international-borders-closed-amid-delhi-bomb-blast-incident-2025-11-11-16-43-53.jpg)
international borders closed amid delhi bomb blast incident
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు బ్లాస్ట్(Delhi Bomb Blast)లో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికలకు(Bihar elections) ఒకరోజు ముందు దేశ రాజధానిలో ఈ దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు. 72 గంటల వరకు ఈ మూసివేత కొనసాగుతుందని ఆ రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు.
Also Read: ఢిల్లీ బ్లాస్ట్ వెనుక నలుగురు డాక్టర్ల కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
Delhi Bomb Blast
ప్రస్తుతం బీహార్‌లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల నాటికి 60.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో జన్‌సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ ఓటు వేశారు. ఈరోజు మొత్తం 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 3.70 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల కోసం 45 వేలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈసారి బీహార్‌లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: ఢిల్లీ బాంబు పేలుడు ఘటన.. దాడికి ముందు Redditలో స్టూడెంట్ పోస్ట్
ఇదిలాఉండగా ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి ఘటన దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ.. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి వివరాలు బయటికి రానున్నాయి. మరోవైపు ఈ దాడిపై తాజాగా స్పందించిన ప్రధాని మోదీ.. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
Follow Us