Thailand-Cambodia border dispute: ఆలయాల నుంచి ల్యాండ్‌మైన్ పేలుళ్ల వరకు.. థాయ్‌-కంబోడియా తాజా యుద్ధానికి కారణాలివే!

థాయిలాండ్-కంబోడియా మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు.. కొన్ని శతాబ్దాల కిందట నుంచి ఈ సరిహద్దు వివాదం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ప్రెహ్ విహియర్ హిందూ దేవాలయం, దాని చుట్టూ ఉన్న భూభాగం వల్ల ఈ గొడవలు అప్పట్లో మొదలైంది.

New Update
Thailand-Cambodian

Thailand-Cambodian(Twitter)

థాయిలాండ్-కంబోడియా మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు.. కొన్ని శతాబ్దాల కిందట నుంచి ఈ సరిహద్దు వివాదం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ప్రెహ్ విహియర్ హిందూ దేవాలయం, దాని చుట్టూ ఉన్న భూభాగం వల్ల ఈ గొడవలు అప్పట్లో మొదలైంది. ఆ తర్వాత మళ్లీ ఈ వివాదం 1907 నాటి ఫ్రెంచ్ వలస పాలనలో గీసిన సరిహద్దు మ్యాప్‌ల నుంచి మొదలైంది. మళ్లీ ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో థాయిలాండ్ కంబోడియా రాయబారిని బహిష్కరించి, దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. కంబోడియా కూడా థాయిలాండ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. సరిహద్దులు మూసివేయడంతో పాటు కంబోడియా థాయ్ దిగుమతులను నిషేధించింది. అయితే ఇరు దేశాల మధ్య వివాదాలకు 11 శతాబ్దం నుంచి మూలాలు ఉన్నాయి. ఇంతకీ థాయ్-కంబోడియా మధ్య యుద్ధం ఎప్పుడు మొదలైంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ప్రెహ్ విహియర్ దేవాలయం

ఈ ఆలయం ఒక కొండపై ఉంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రెహ్ విహియర్ దేవాలయం కంబోడియాకు చెందుతుందని తీర్పు చెప్పింది. 2013లో ICJ ఈ దేవాలయం చుట్టూ ఉన్న భూమి కూడా కంబోడియాదే అని తన తీర్పునిచ్చింది. అయితే థాయిలాండ్ ఈ మ్యాప్‌లు, తీర్పుల చట్టబద్ధతను ప్రశ్నిస్తూనే ఉంది. ఇటీవల ఘర్షణలకు కారణమైన టా మూన్ థోమ్, టా క్రాబీ దేవాలయాలు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో ఉన్నాయి.

వలసవాద ప్రభావం

1907 నాటి ఫ్రెంచ్ వలస పటాలు సరిహద్దు రేఖను గీయడంలో అస్పష్టత ఉంది. ఈ వివాదానికి ఇదే ప్రధాన కారణం. థాయిలాండ్ ఈ పటాలు తమకు వ్యతిరేకంగా పక్షపాతంతో ఉన్నాయని వాదిస్తుంది.

ఇది కూడా చూడండి:Hari Hara Veeramallu:  హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...

వెస్టిగేజ్ ఆఫ్ కొలోనియల్ మ్యాప్స్

19వ శతాబ్దం చివరలో కంబోడియాను ఫ్రాన్స్ ఆక్రమించినప్పుడు, థాయ్‌లాండ్ (అప్పటి సియామ్), కంబోడియా మధ్య సరిహద్దులు గీశారు. 1907లో ఫ్రెంచ్ వారు గీసిన ఒక మ్యాప్, ముఖ్యంగా "వాటర్‌షెడ్ లైన్" ఆధారంగా సరిహద్దును స్పష్టం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ మ్యాప్ అస్పష్టంగా ఉండటం, థాయ్‌లాండ్ దీనిని సరిగ్గా అంగీకరించలేదని వాదించడంతో సరిహద్దులో అనేక ప్రాంతాలు వివాదాస్పదంగా మారాయి.

ల్యాండ్‌మైన్ పేలుళ్లు

ఇటీవల, సరిహద్దు ప్రాంతంలో ల్యాండ్‌మైన్ పేలుళ్లు జరిగాయి. ఇందులో థాయ్ సైనికులు గాయపడ్డారు. ఈ ల్యాండ్‌మైన్‌లను కంబోడియా కొత్తగా అమర్చిందని థాయ్‌లాండ్ ఆరోపించగా, కంబోడియా వాటిని గత యుద్ధాల అవశేషాలుగా పేర్కొంది. ఈ సంఘటన తాజా ఉద్రిక్తతలకు తక్షణ కారణమైంది.

ఇది కూడా చూడండి:11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్‌ బోర్డుకు తరలింపు..

సైనిక చర్యలు

ఇరుదేశాల సైన్యాలు ఒకరినొకరు కాల్పులు జరపడం, రాకెట్ దాడులు, వైమానిక దాడులు (ఎయిర్‌స్ట్రైక్స్) వంటి చర్యలకు పాల్పడ్డాయి. థాయ్‌లాండ్ F-16 యుద్ధ విమానాలను కూడా మోహరించింది.

దౌత్య సంబంధాల క్షీణత

ల్యాండ్‌మైన్ సంఘటనల తర్వాత, థాయ్‌లాండ్ కంబోడియా రాయబారిని బహిష్కరించి సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. దీనికి ప్రతిగా కంబోడియా తన దౌత్య సంబంధాలను అత్యంత తక్కువ స్థాయికి తగ్గించి, తన రాయబార కార్యాలయం సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది.

దేశీయ రాజకీయాలు

ఇరు దేశాలలోనూ అంతర్గత రాజకీయ పరిస్థితులు సరిహద్దు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. థాయ్‌లాండ్‌లో ప్రధాని పదవిలో ఉన్న పాటొంగ్ తార్న్ షినవత్రా ఒక లీకైన ఫోన్ కాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఇది థాయ్ సైన్యం, రాజకీయ వర్గాల నుండి విమర్శలను ఎదుర్కొంది. కంబోడియా ప్రధాని హున్ మానేట్ కూడా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సాయుధ బలగాలను ఉపయోగించక తప్పదని ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు