Road Accident: వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఒంటిమిట్ట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంతో వస్తున్న ఓ వాహనం ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.