/rtv/media/media_files/2025/08/06/ap-cabinet-2025-08-06-12-18-34.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(andhra-pradesh-government) రాష్ట్ర పాలనా సౌలభ్యం, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు అలాగే కొన్ని నియోజకవర్గాల మార్పులకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్(AP Cabinet Meeting) ఆమోదం తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో కీలకమైన మదనపల్లెను కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ఆమోదం లభించింది.
Also Read : రైలు ప్రమాదంతో నిలిచిన పలు రైళ్లు... అనేక రైళ్లు ఆలస్యం..హెల్ప్‌లైన్ ఏర్పాటు
Cabinet Approves Proposals For New Districts In AP
జిల్లాల భౌగోళిక సరిహద్దులు, పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాలోకి మారుస్తున్నారు. గతంలో అన్నమయ్య జిల్లాలో భాగంగా ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని తిరిగి కడప (వైఎస్ఆర్) జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అన్నమయ్య జిల్లా పరిధిలోని రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి జిల్లాకు మారుస్తున్నారు.
Also Read : మచిలీపట్నంలో హైటెన్షన్.. రంగా వర్ధంతి లో ఉద్రిక్తత
Follow Us