Train Fire: అర్థరాత్రి అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది.  ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

New Update
FotoJet (35)

Tatanagar- Ernakulam Express Fire

Train Fire : విశాఖ జిల్లా దువ్వాడ(duvvada) మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌(Tatanagar Express Train) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి(Fire Acc!dent) గురైంది.  ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు(train fire accident) చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది.ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు గుర్తించి ఎలమంచిలి సమీపంలోని పాయింట్‌ వద్ద స్టేషన్‌లో  రైలును నిలుపుదల చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు వచ్చేలోపే రెండు బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దూకి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో B1 బోగీలో ఉన్న ఒకరు సజీవ దహనమయ్యారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70) గా గుర్తించారు.ఈ రైలు అనకాపల్లి(anakapalle crime)కి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

Also Read :  రైలు ప్రమాదంతో నిలిచిన పలు రైళ్లు... అనేక రైళ్లు ఆలస్యం..హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

పలు రైళ్లు నిలిపివేత

అగ్ని ప్రమాదం కారణంగా ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని రైల్వేస్టేషన్లలో పలు రైళ్లు నిలిపివేశారు. కాగా రెండు బోగీల్లోని ప్రయాణికులను  3 ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోట స్టేషన్‌కు తరలించారు.  సామర్లకోటలో 2 ఏసీ బోగీలను జత చేసి అక్కడి నుంచి ఎర్నాకుళానికి తరలించనున్నారు.అగ్నిప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై రైల్వే అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.  

మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

ఘటన విషయం తెలియగానే అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో  రెండు బోగీల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన ఘటన స్థలికి అంబులెన్స్‌లను రప్పించారు. ఒకవైపు చలి, మరోవైపు పొగతో సుమారు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లో ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి 3.30గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను ఘటన స్థలినుంచి తొలగించారు.

Also Read :  YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

Advertisment
తాజా కథనాలు