/rtv/media/media_files/2025/12/26/fotojet-13-2025-12-26-18-33-03.jpg)
Amaravati farmer dies in front of Minister Narayana
Amaravati : అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన మందడం గ్రామసభలో విషాదం నెలకొంది. మున్సిపల్ మంత్రి నారాయణ(ap minister narayana) పాల్గొన్న గ్రామసభ(grama sabha) లో రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదనకు గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మంత్రి నారాయణ ఎదుటే రైతు రామారావు తన బాధను వెల్లగక్కారు. “మంత్రి నారాయణే మమ్మల్ని ముంచేశాడు” అంటూ భావోద్వేగంగా మాట్లాడిన రామారావు, తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేకపోతున్నానని వాపోయారు. - Amaravati Farmers Issues
Also Read : జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి పర్యటనలన్నీ రద్దు!
Amaravati Farmer Dies
మంత్రి నారాయణ చెప్పడం వల్లే తమకు వాగుల్లో ఫ్లాట్లు కేటాయించారని రైతు రామారావు ఆరోపించారు. రాజధాని పేరుతో తమ భూములు ఇచ్చినా, న్యాయం జరగలేదని గ్రామసభలో బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్‌లోనే ప్లాట్లు ఇవ్వాలని రామారావు గట్టిగా డిమాండ్ చేశారు. “ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే అది మా గొంతు కోసినట్లే” అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మాట్లాడుతున్న క్రమంలోనే రామారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు స్పందించి సీపీఆర్ చేసి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం.
గ్రామసభలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రైతు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read : వెంకన్న బంగారం మాయం... విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు
Follow Us