/rtv/media/media_files/2025/12/26/fotojet-17-2025-12-26-21-38-48.jpg)
perni nani
మచిలీపట్నం(machilipatam)లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నియోజకవర్గంలోని నాయుడు పేటలో వంగవీటి మోహనరంగా(Vangaveeti Ranga) వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి కోసం రామానాయుడుపేట నుంచి వైఎస్సార్‌సీపీ(ysrcp) భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో చంపేస్తున్న చలి.. మరో రెండు రోజులు గజ గజే!
Ranga's Death Anniversary
అయితే ఈ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. తొలుత ఇదే రూట్‌లో కూటమి నేతల ర్యాలీ ఉందని ఆ తర్వాతే మీ ర్యాలీ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. అయితే తాము కూటమి నేతలు వెళ్లే దారిలో కాకుండా వేరే రూట్‌లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను పేర్ని నాని నిలదీశారు. వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి ర్యాలీకి అనుమతి ఇచ్చామని, ఇరవర్గాలు తారసపడితే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్ని నానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ ఆఫీస్ ముందు బారికేడ్లు, అదనపు బలగాలు ఏర్పాట్లు చేసినట్లు సీఐ ఏసుబాబు వివరించారు. ఈ వివరణతో పేర్ని నాని మండిపడ్డారు. పోలీసుల పక్షపాతధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు పేర్ని నాని(perni-nani) డిమాండ్‌తో దిగొచ్చిన పోలీసులు వైసీపీ ర్యాలీకి అనుమతివ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Also Read : జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి పర్యటనలన్నీ రద్దు!
Follow Us