Cyber Crimes: ఏడాదిలో రూ.751.40 కోట్లు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నట్లు గణంకాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఏకంగా రూ.756.40 కోట్లు కాజేశారు.

New Update
Cyber Crimes

Cyber Crimes

సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​Criminals) రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నట్లు గణంకాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఏకంగా రూ.756.40 కోట్లు కాజేశారు. డిజిటల్ అరెస్టులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఓటీపీ, క్రిప్టోకరెన్సీ, వర్క్‌ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, ఆన్‌లైన్‌ పెట్టుబడులు, న్యూడ్‌ వీడియో కాల్స్‌ లాంటి వాటితో అమాయకులకు వల వేసి డబ్బులు లాగేశారు.  నేషనల్ సైబర్‌ క్రైమ్(Cyber ​​Crime) రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఈ ఏడాది ఏపీలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ గణంకాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read: కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశం

Increasing Cyber Crimes In AP

జనవరి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రం నుంచి ఈ పోర్టల్‌కు 57,673 ఫిర్యాదు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే బాధితులు రోజుకు రూ.2.05 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు తేలింది. నేషనల్ సైబర్‌ క్రైమ్‌కు అందిన ఫిర్యాదుల్లో ఒకే తరహాలో ఉన్నవాటిని పోలీసులు వర్గీకరించి 1,771 కేసులు నమోదు చేశారు. అయితే ఈ ఏడాది సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.751.40 కోట్లు దోచుకోగా అందులో కేవలం 2.21 కోట్లు (0.29 శాతం)మాత్రమే అధికారులు వెనక్కి తీసుకొచ్చారు. అంటే బాధితులు పోగొట్టుకున్న డబ్బులో కనీసం ఒక్క శాతం కూడా రికవరీ కాకపోవడం గమనార్హం. మరో రూ.89 కోట్లు (11.84 శాతం) నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా బ్యాంకు అకౌంట్లను నిలిపివేశారు.

Also Read: భారీగా విమానాలు నడుపుతున్నా.. భారత విమానయాన సంస్థలు ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నాయి?

 బాధితుల బ్యాంకు అకౌంట్‌ నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి డబ్బు రాగానే వాళ్లు వెంటనే వందల ఖాతాల్లోకి పంపించేస్తున్నారు. ఇలా చేయడం కోసం కమీషన్లు ఇచ్చి ప్రత్యేక టీమ్‌లనే నడిపిస్తున్నారు. అందుకే దర్యాప్తు సంస్థలకు బాధితులు డబ్బు రికవరీ చేయడం చాలా కష్టతరంగా మారింది. ఈ సైబర్ కేటుగాళ్లు విదేశాల్లో ఉంటూ తమ ఆపరేటర్లను ఇక్కడ పెట్టుకోని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ డబ్బు నేరగాళ్ల అకౌంట్లోకి వెళ్లకుండా బ్యాంకు అకౌంట్‌ను నిలిపివేసే ఛాన్స్ ఉంటుంది. ఇందుకోసం 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. 

Advertisment
తాజా కథనాలు