Train Accident:  రైలు ప్రమాదంతో నిలిచిన పలు రైళ్లు...అనేక రైళ్లు ఆలస్యం..హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.

New Update
Train

Indian Train Fire

Train Fire: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు(fire accident) చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు. ప్రమాదం నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లతో పాటు విశాఖకు రావాల్సిన మరికొన్ని రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. - train-accident

ప్రమాదం నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఈస్ట్‌కోస్ట్‌, బెంగళూరు హంసఫర్‌, షాలిమార్‌-చర్లపల్లి(18045), ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌, పూరీ-తిరుపతి,  విశాఖ-లింగంపల్లి (12805), విశాఖ-గుంటూరు (17240) ఎక్స్‌రైళ్లు  సుమారు 3-4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖకు రావాల్సిన గోదావరి, తిరుపతి-హావ్‌డా కూడా ఆలస్యంగా నడుస్తోంది. ఎలమంచిలిలో ఆగే రైళ్లను అధికారులు విశాఖలో నిలిపివేసి ఆ తర్వాత పంపుతున్నారు. ఇక ఎలమంచిలిలో హాల్ట్‌ లేని వాటిని యథావిధిగా పంపిస్తున్నారు. వందేభారత్‌, జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు విశాఖ నుంచి యథావిధిగా బయల్దేరుతాయని అధికారులు తెలిపారు.

అర్ధరాత్రి టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌(Tatanagar Express Train) లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో అనకాపల్లి(anakapalle crime) రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ల కోసం ప్రయాణీకులు పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్నారు. ఎలమంచిలిలో జనరల్ టికెట్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. కేవలం రిజర్వేషన్‌ వారికే అనుమతిస్తు్న్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

Also Read :  అర్ధరాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్...ఎవరోస్తారో రండి అంటూ..

హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

కాగా, రైలు ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు  పలు స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ నంబర్లను  ఏర్పాటు చేశారు. రైళ్ల సమాచారానికి సంబంధించిన వివరాలను కాల్‌ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. - railway-helpline-numbers

ఎలమంచిలి- 7815909386 
అనకాపల్లి- 7569305669
రాజమహేంద్రవరం- 0883-2420541/43 
తుని- 7815909479 
ఏలూరు- 7569305268
సామర్లకోట- 7382629990  
విజయవాడ- 0866-2575167

Also Read :  MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

Advertisment
తాజా కథనాలు