/rtv/media/media_files/2025/12/06/weather-update-2025-12-06-10-05-25.jpg)
Weather Update
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ(ap-and-telangana)లో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరిగి.. చలి తీవ్రత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ, సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు అయ్యే సరికి కూడా పొగమంచు కురుస్తుండటంతో ఏ పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు.
ఇది కూడా చూడండి: Telangana: న్యూఇయర్ వేడుకలపై సజ్జనార్ సంచలన ప్రకటన.. రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
ఈ జిల్లాల్లో పెరుగుతున్న చలి..
తెలంగాణలో తూర్పు, ఈశాన్య దిశ నుంచి చలి గాలులు బలంగా వీస్తున్నాయి(telangana weather news). దీంతో పలు జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, కామారెడ్డి, వినుకొండ, ఖమ్మం, కొమరం భీం ఆసిఫిబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం సమయాల్లో ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది కూడా చూడండి: YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?
ఇక ఏపీ విషయానికొస్తే.. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత(ap weather updates) ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరకులో 5 డిగ్రీలు, మినుములూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అయితే ఈ చలి వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారు. వీరు చలికి స్వెటర్లు ధరించి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Machilipatnam : మచిలీపట్నంలో హైటెన్షన్ ..రంగా వర్ధంతి లో ఉద్రిక్తత
Follow Us