Delhi: ఢిల్లీ హాట్ లో భారీ అగ్నిప్రమాదం...
హస్తకళల సమాహారమైన ఢిల్లీ హాట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి తొమ్మది ప్రాంతంలో అక్కడి మార్కెట్ లో మంటలు చెరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దాదాపు 25 నుంచి 30 దుకాణాలు కాలిపోయాయి.
Nursing Student Killed : యాచకవృత్తి చేస్తూ..కూతుర్ని నర్సింగ్ చదివిస్తున్నారు..కానీ ఇంతలోనే...
తాము చేస్తున్న యాచకవృత్తిని తమ పిల్లలు చేయద్దనుకున్నారు. తమకు చదువు లేకున్నా తమ పిల్లలను చదివించాలనుకున్నారు. వారు ఉన్నత స్థితిలో ఉంటే చూసి మురిసిపోవాలని కలలుగన్నారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. బిడ్డను డాక్టర్ గా చూడాలనుకున్న వారి కోరిక తీరలేదు.
Simhachalam Temple Incident: సింహాచలం ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి..2 లక్షల పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
విద్యార్థినులపైకి దూసుకెళ్లిన బొలేరో వాహనం.. ఇద్దరు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న నర్సింగ్ విద్యార్థినులపై ఆ వాహనం దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు విద్యార్థినులు అక్కడిక్కడే మృతి చెందారు.
BIG BREAKING: తిరుపతిలో మరో ఘోర ప్రమాదం.. భవనంపై నుంచి పడి ముగ్గురు స్పాట్ డెడ్!
తిరుపతి నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగురు కార్మికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మంగళంలోని తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్నహెచ్ఐజీ భవనం పైనుండి పడి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.
Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!
తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది. చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Road Accident: పారిశుద్ధ్య కార్మికుల మీదకి దూసుకెళ్లిన వ్యాన్.. ఆరుగురు మృతి
హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ, ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్ వేపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలైయ్యారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.