Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. వరుడితో సహా 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారులో వరుడి(24)తో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Speeding SUV Crashes Into Uttar Pradesh College Wall

Speeding SUV Crashes Into Uttar Pradesh College Wall

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారులో వరుడి(24)తో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంభాల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో ఓ బొలెరో SUV కారు బయలుదేరింది. జెవానై గ్రామంలో ఉదయం 6.30 గంటలకు జనతా ఇంటర్‌ కాలేజీకి దగ్గర్లో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. దీంతో ఆ కాలేజీ సరిహద్దు గోడను బలంగా ఢీకొట్టింది.  

Also Read: యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో ట్విస్ట్ ...అంతా ఉత్తదే..

ఆ కారులో 10 మంది ఉండగా.. వరుడితో సహా అయిదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు మృతి చెందారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వాళ్లకు చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బొలెరో వాహనంలో 10 మంది ప్రయాణం చేయడం దాని సామర్థ్యానికి మించిందేనని పోలీసులు చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. 

Also Read: మసూద్ అజర్‌ ఎక్కడున్నాడంటే.. భుట్టో సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు