/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
Accident News: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ఎస్‌యూవీ కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా 5 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంభాల్‌లోని హర్ గోవింద్‌పూర్ గ్రామం నుంచి బుడాన్ జిల్లాలోని సిర్టౌల్‌లో ఉన్న వధువు గ్రామానికి వరుడు సూరజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరాడు.
#WATCH | Sambhal, UP | On a car accident in the Junawai area, Sambhal SP KK Bishnoi says, "At around 7.30 pm, we received information that a Bolero Neo car has collided with the wall of Janta Inter College. Police reached the spot and removed the car with the help of a JCB. Five… pic.twitter.com/sAt9ndem8l
— ANI (@ANI) July 5, 2025
పెళ్లికి వెళ్తుండగా
దాదాపు 10 మంది ఈ కారులో కూర్చుకున్నారు. అయితే తెల్లవారుజామున రోడ్లు ఖాళీగా ఉండడంతో డ్రైవర్ కారును వేగంగా పోనిచ్చాడు. ఈ క్రమంలోనే అనుకోని దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారు హఠాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో అదుపుచేయలేకపోయిన డ్రైవర్ పక్కనే ఉన్న జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయిపోయింది. వరుడితో సహా ఒకే కుటుంబానికి చెందిన 5 గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను బయటకు తీశారు. అలాగే క్షతగాత్రులను అలీఘర్‌లోని ప్రభుత్వ వైద్య కేంద్రానికి తరలించారు.
మృతుల్లో వరుడి వదిన ఆశా, ఆశా కుమార్తె ఐశ్వర్య, కుమారులు మనోజ్, విష్ణు ఉన్నారు. అలాగే వరుడి అత్త, ఇద్దరు మైనర్లు సహా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!