Accident News: పెళ్ళికి వెళ్తుండగా ఘోరం.. వరుడితో సహా 5 మంది స్పాట్ డెడ్!
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్యూవీ కారు నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.