BREAKING: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. అందరూ గల్లంతు!

జమ్మూకశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలో సింధూ నదిలో ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. భారీ వర్షాల కారణంగా వాహనం అదుపు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గల్లంతైనట్లు సమాచారం.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

నిర్లక్ష్యం, అతివేగం వంటి కారణాల వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అయితే అధికంగా జరుగుతున్నాయి. తక్కువ వెడల్పులో రోడ్లు ఉండటంతో ఏ మాత్రం అదుపు తిప్పినా కూడా ప్రమాదం జరిగే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. భారత-టిబెటన్ సరిహద్దు పోలీసుల (ఐటీబీపీ) సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపు తప్పి సింధూ నదిలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నవారంతా గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా బస్సు అదుపు తప్పినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Crime News: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఇది కూడా చూడండి: BREAKING: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. స్పాట్‌లోనే 18 మంది?

భారీ వర్షాల కారణంగా..

ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు తడిగా మారాయి. దీంతో ప్రయాణించేటప్పుడు వాహనాలు అదుపు తప్పే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఐటీబీపీ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి సింధూ నదిలో పడిపోయింది. అయితే ఈ బస్సులో ఇప్పటి వరకు ఎంత మంది ఉన్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బస్సులో ఎందరు ఉన్నవారు వారంతా కూడా గల్లంతయ్యారు. వెంటనే విషయం తెలుసుకుని అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Train Accident: షాకింగ్ వీడియో.. ఘోర రైలు ప్రమాదం - ప్రాణాలు వదిలిన ప్రయాణికులు

ఇది కూడా చూడండి: China Floods: ముంచెత్తుతున్న భారీ వరదలు.. భయపడుతున్న ప్రజలు.. 34 మంది మృతి?

సిబ్బంది ఆచూకీ..

గల్లంతు అయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు అయితే నదిలో కొట్టుకుని పోయింది. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే బస్సులో ఎంత మంది ఉన్నారనే విషయం ఇంకా తెలియదు. ఎంత మంది సిబ్బంది బస్సులో ఉన్నారు, గల్లంతు అయిన వారు ఎందరు ఉన్నారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు