/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
అతివేగం, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తొందరగా వెళ్లాలని, మరికొందరు బాధ్యత లేకుండా అతివేగంతో ప్రయాణిస్తారు. ఈ క్రమంలో వారికి కాకుండా ఇతరులకు అయినా ప్రమాదం వాటిల్లుతుంది. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి మండలం కృష్ణపాలెం ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ వాహనం, కంటైనర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఇది కూడా చూడండి: Road Accident: ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు.. స్పాట్‌లోనే 40 మంది?
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఘోర ప్రమాదం
— RTV (@RTVnewsnetwork) September 4, 2025
కృష్ణపాలెం ఫ్లైఓవర్‌పై టాటా మ్యాజిక్- కంటైనర్ ఢీ
ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ నాని, డాన్స్ మాస్టర్ మృతి
కంటైనర్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు డాన్సర్లకు తీవ్రగాయాలు..హైవేపై కంటైనర్‌ను ఢీకొట్టిన మరో లారీ
లారీ ఢీకొట్టడంతో వెనక్కు… pic.twitter.com/fUtjJUza8z
కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో..
మృతులలో టాటా మ్యాజిక్ డ్రైవర్ నాని, ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు. కంటైనర్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు డాన్సర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘోర ప్రమాదానికి కారణం ఓ లారీ అని తెలుస్తోంది. హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ను లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కంటైనర్ వాహనం కొంత దూరం వెళ్లి వెనుక నుంచి వస్తున్న టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టింది. కంటైనర్ బలంగా టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో అందులో ఉన్న డ్యాన్స్ మాస్టర్ డ్రైవర్ స్పాట్‌లోనే మృతి చెందారు.
మిగతా వారికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన టాటా మ్యాజిక్ వాహనంలో మొత్తం ఎనిమిది మంది డాన్సర్లు ఉన్నారు. వీరంతా విజయవాడ నుంచి నెల్లూరులో జరగనున్న వినాయక చవితి ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఇంతలోనే ఇలా జరిగింది. అయితే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Road Accident: అయ్యో దేవుడా.. ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్