Bangalore Fire Accident: ఘోర అగ్నిప్రమాదం .. ఐదుగురి సజీవ దహనం!

బెంగళూరులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. KR మార్కెట్‌ నగర్తపేటలోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్‌లోని ప్లాస్టిక్‌ వస్తువుల షాపులో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

New Update
fire accident

Bangalore Fire Accident

Bangalore Fire Accident: బెంగళూరులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. KR మార్కెట్‌ నగర్తపేటలోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్‌లోని ప్లాస్టిక్‌ వస్తువుల షాపులో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం కాగా ఇందులో మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. మృతులు మదన్‌కుమార్‌, సంగీత, మితేశ్‌, విహాన్‌, సురేశ్‌గా గుర్తించారు. వీరంతా  రాజస్థాన్‌కు చెందిన వారని తేలింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలంలో పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు. 

రూ.5 లక్షల పరిహారం

ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పరిశీలించారు.ఈ విషాదానికి అక్రమ నిర్మాణాలే కారణమని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని  ప్రకటించారు. అంతకుముందు, హోంమంత్రి జి. పరమేశ్వర కూడా ఆ స్థలాన్ని పరిశీలించి, ఈ సంఘటనను విషాదకరంగా అభివర్ణించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఈ అగ్నిప్రమాదానికి వైరింగ్ లోపం వల్లే కారణమై ఉండవచ్చని అన్నారు.  "షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ ప్రాథమికంగా చెబుతోంది. ఈ భవనాల యజమానులను మేము అరెస్టు చేసాము... వారు ఎటువంటి భద్రతా మార్గదర్శకాలను పాటించలేదు. వారు ఎటువంటి అనుమతి లేకుండా అదనపు అంతస్తులను నిర్మించారు..." అని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు