/rtv/media/media_files/2025/09/18/road-accident-2025-09-18-16-15-06.jpg)
Road Accident
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీకోని ముగ్గురు వ్యక్తులు మరణించడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా ఘనపురం మండలానికి చెందిన ముగ్గురు ప్రయాణికులు ఆటోలో భూత్పుర్ వైపు వెళ్తున్నారు. ఆ ఆటో డ్రైవర్ కొత్తమొల్గర సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొన్నాడు. గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
మృతులు గట్టుకాడిపల్లి గ్రామానికి చెందిన సంపల్లి వంశీ (24), దొంతికుంట తాండకు చెందిన పాత్లవత్ సక్రి (34) హైదరాబాద్‌కు చెందిన నర్సింహారెడ్డి (57)గా గుర్తించారు. ప్రమాదం జరిగాక వంశీ, నర్సింహరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సక్రికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: రూ.50వేలకు సీపీఐ నేత కక్కుర్తి.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి!
ఇదిలాఉండగా వనపర్తి జిల్లా రాయికల్ సమీపంలో కూడా గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రాయికల్ రైస్‌మిల్ సమీపంలో ఆటో, లారీ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొందని పోలీసులు తెలిపారు.