BIG BREAKING: భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ కి ఘోర యాక్సిడెంట్ .. 8 మంది స్పాట్ డెడ్!

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాస్గంజ్ నుంచి రాజస్థాన్ లోని గోగామేడికి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 43 మంది తీవ్రంగా  గాయపడ్డారు.

New Update
Accident

Accident

BIG BREAKING: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాస్గంజ్ నుంచి రాజస్థాన్ లోని గోగామేడికి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 43 మంది తీవ్రంగా  గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు  గాయపడిన వారిని ఖుర్జాలోని కైలాస్ ఆసుపత్రికి తరలించారు. బులంద్ షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటల్ గ్రామం సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. 

వెనుక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ఉన్న ప్రయాణికులంతా చెల్లచెదురుగా ఎగిరి పడ్డారు. కొంతమంది అక్కడిక్కడే చనిపోగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసు వాహనం, అంబులెన్స్ , బాటసారుల సహాయంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

 ఇందులో 29 మందిని కైలాష్ ఆసుపత్రికి, 18 మందిని ముని సిహెచ్‌సికి, 10 మందిని జాటియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కైలాష్ ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలు, ముని సిహెచ్‌సిలో ఆరుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన వారికి చికిత్స జరుగుతోంది. ట్రాక్టర్ లో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.

మృతుల్లో ఈపు బాబు (50), ధనిరామ్ (40), మృతుల్లో చాందిని (12), రాంబేటి (62), మౌశ్రీ, శివాంశ్ (6) తదితరులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎస్పీ రూరల్, ఎస్పీ క్రైం శంకర్ ప్రసాద్, ఏడీఎం ప్రమోద్ కుమార్ పాండే, ఎస్‌డీఎం ప్రతీక్షపాండే, సీఓ పూర్ణిమ సింగ్ మొత్తం నాలుగు స్టేషన్‌ల పోలీసులు సంఘటన స్థలంలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

ఆలయానికి వెళ్తుండగా.. 

అయితే కాస్గంజ్ జిల్లాలోని సోరో పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రఫాయద్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలోని గోగమేడి ఆలయానికి బయలుదేరారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. 

Also Read: Crime: అయ్యో.. కట్నం కోసం తిండి పెట్టకుండా హింసించి.. చివరికి ఎలా చేశారంటే!

Advertisment
తాజా కథనాలు