/rtv/media/media_files/2025/09/09/bus-2025-09-09-10-42-33.jpg)
8 killed, 45 injured as train rams into double-decker bus in Mexico
మెక్సికోలో విషాదం చోటుచేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సు రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అట్లాకో నగరంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉండే చోటే ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: అదే జరిగితే..సగం సుంకాలను తిరిగి చెల్లిస్తాం..అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్
🚨🇲🇽 MEXICO BUS-TRAIN COLLISION
— Info Room (@InfoR00M) September 8, 2025
🔹A train collided with a double-deck bus in Atlacomulco, northwest of Mexico City, killing at least 8 people and injuring 45 early Monday. Authorities are still working at the crash site in an industrial zone. Cause remains under investigation.… pic.twitter.com/xd5hVtOshr
Also Read: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. దొంగతనం చేయడంలో కిక్కే వేరట.. బయటపడ్డ సర్పంచ్ భాగోతం
ఈ వీడియోలో గమనిస్తే రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. డబుల్ డెక్కర్ బస్సు కూడా వెళ్తుండగా అదే సమయంలో ఓ రైలు వేగంగా వచ్చి ఢీకొంది. కొద్దిదూరం వరకు బస్సును ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు అకస్మాత్తుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోడ్డుపై పలు వాహనాలు ఆగి ఉన్నాయి. కానీ డబుల్ డెక్కర్ బస్సు ముందుకు వెళ్లి పట్టాల మధ్యకు రావడంతో అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు దాన్ని ఢికొట్టింది.
Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..
ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. డ్రైవర్‌కు సిగ్నల్ కనిపించలేదా ? లేదా ఇంకా ఏదైనా ఇతర లోపాలు ఉన్నాయా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా గతంలో కూడా మెక్సికోలో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2021 మే నెలలో ఓ ఎలివేటెడ్ విభాగం రైలు పైకి వెళ్తుండగా కూలింది. ఈ ప్రమాదంలో ఏకంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 98 మందికి పైగా గాయపడ్డారు. వెల్డింగ్ డిజైన్ లోపల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది .
A train slammed into a double-deck bus northwest of Mexico City early Monday, killing at least eight people and injuring 45, authorities said. - AP pic.twitter.com/q1g9Rx4CKS
— Open Source Intel (@Osint613) September 8, 2025
Also Read: నేపాల్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం ఎత్తివేత