CRPF Jawan: వ్యాన్ లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం విషాదం చోటు చేసుకుంది.  CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మరణించారు, మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉదయం 10:30 గంటల సమయంలో కంద్వా-బసంత్‌గఢ్ మధ్య జరిగింది.

New Update
CRPF vehicle

CRPF Jawan

CRPF Jawan: 

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం విషాదం చోటు చేసుకుంది.  CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మరణించారు, మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉదయం 10:30 గంటలకు కంద్వా-బసంత్‌గఢ్ మధ్య జరిగింది.

సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 187వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఓ ఆపరేషన్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ నేతపై వాటర్‌ బాటిల్‌ విసిరిన BRS ఎమ్మెల్యే

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ సలోని రాయ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన జవాన్ల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యల్లో పాలుపంచుకోవడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ దుర్ఘటనపై కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా సంతాపం ప్రకటించారు. వీర జవాన్ల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా కొండ ప్రాంతం కావడంతో రోడ్లు ప్రమాదకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

Also Read:సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు

Advertisment
తాజా కథనాలు