Road Accident: అయ్యో దేవుడా.. ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్

పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా ప్రయాణించిన కారు ముందుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పాట్నాలోని కుర్జీ, గోపాల్‌పూర్, పటేల్ నగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.

New Update
Patna Road Accident five killed

Patna Road Accident five killed

రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, మితిమీరిన వేగం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం, అధికారులు తరచూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వారితో పాటు రోడ్డు పై ప్రయాణించే వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

Patna Road Accident

తాజాగా అలాంటిదే మరొక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత వేగంగా ప్రయాణించిన కారు, ట్రక్కు ఒక్కసారిగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లో మృతి చెందారు. అయితే అందిన సమాచారం ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో కారు ముక్కలు ముక్కలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read : ఎయిరిండియా స్పెషల్ సేల్.. అతి తక్కువ ధరకే విలాసవంతమైన అంతర్జాతీయ ప్రయాణం!

ఈ భారీ యాక్సిడెంట్ నిన్న రాత్రి పాట్నాలోని పర్సా బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. వేగంగా ప్రయాణించిన కారు ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టడంతో 5గురు స్పాట్‌లో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా పాట్నాలోని కుర్జీ, గోపాల్‌పూర్, పటేల్ నగర్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదం అత్యంత భయంకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read : జొమాటో యూజర్లకు బిగ్ షాక్.. ఒక్కో ఆర్డర్‌పై భారీగా పెంచిన ఫీజులు!

అతి వేగంగా వెళ్లిన కారు ట్రక్కును ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది. అయితే ఢీకొన్న తర్వాత భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కట్టర్ సహాయంతో కారును ముక్కలు చేసి.. మృతదేహాలను బయటకు తీశారు. ఆపై మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మరణించిన వారందరూ తమ పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి పాట్నాకు వస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇలాంటిదే మరొక ఘోరమైన ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం కృష్ణపాలెం ఫ్లైఓవర్ వద్ద దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్ వాహనం, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో టాటా మ్యాజిక్ డ్రైవర్, ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. అలాగే కంటైనర్ డ్రైవర్ సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను హాస్పిటల్‌కు పంపించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు