BIG BREAKING: టూరిస్టు బస్సు బోల్తా.. ఐదుగురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నయాగరా వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
At least 5 people killed after tour bus traveling back from Niagara Falls crashes

At least 5 people killed after tour bus traveling back from Niagara Falls crashes

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నయాగరా వాటర్‌ఫాల్స్‌ చూసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు న్యూయార్క్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సును ఏ వాహనం ఢీకొనలేదని.. డ్రైవర్‌ కంట్రోల్ తప్పడం వల్లే బోల్తా పడినట్లు అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు. అందులో ఉన్న ప్రయాణికులు చాలామంది సీటు బెల్డు పెట్టుకోలేదని.. అందుకే వాళ్లని సులభంగా బస్సు నుంచి బయటికి తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు.

Also Read: భారతదేశంలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్.. ట్రంప్ కుట్ర అదేనా? 

Also Read: చైనా బాటలోనే రష్యా.. వాట్సాప్‌ వాడకుండా ఏం చేస్తోందో తెలుసా?

ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడి స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం.. నాలుగు హెలికాప్టర్‌లు, కొన్ని అంబులెన్స్‌లలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల రోడ్‌పై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Also Read: పర్యాటకులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్.. ఈ విమానాల్లో ప్రయాణం ఫ్రీ!

 అయితే పర్యాటకుల్లో ఎక్కువమంది భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందినవాళ్లే ఉన్నారని పోలీసులు తెలిపారు. దీనిపై న్యూయార్స్‌ గవర్నర్‌ క్యాథీ హోచ్‌ల్ కూడా స్పందించారు. ఇదో విషాద ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 

Also Read: పాకిస్తాన్‌ను లేపుతున్న అమెరికా, చైనా.. డేంజర్ జోన్‌లో ఇండియా

ఇదిలాఉండగా చైనాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సిచువాన్-క్వింగ్‌హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. అయితే ఈ ప్రమాదం చైనా స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు