హైడ్రా తీరు మీద తెలంగాణ మక్ష్మకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ముందుగా చెప్పకుండా నిర్మాణాలను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.జీవో 99 మీద వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు అయింది. జీవో 99ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ లక్ష్మి. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్పూర్లో మూడు షెడ్లు కూల్చేసారని అమె కోర్టు దృష్టకి తీసుకువచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా పడగొట్టారని చెప్పారు. దీని మీద విచారణ చేసిన కోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.