BIG BREAKING: కవితకు కేసీఆర్ ఫుల్ సపోర్ట్?: హరీష్, కేటీఆర్ తో కీలక భేటీ!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్‌ తో  ఎమ్మెల్యేలు  కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్ మల్లన్న గొడవ నేపథ్యంలో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

New Update
kcr-kavitha

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్‌ తో  ఎమ్మెల్యేలు  కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్ మల్లన్న గొడవ నేపథ్యంలో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత ఇష్యూపై ఇప్పటిదాకా కేసీఆర్‌, కేటీఆర్, హరీష్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.  ఈ భేటీ అనంతరం కేసీఆర్ దీనిపై ఏమైనా మాట్లాడుతారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కవిత, తీన్మార్‌మల్లన్న పోలీస్ స్టేషన్ లలో పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో ఇద్దరిపై వేరువేరుగా కేసులు నమోదయ్యాయి.  

క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి

ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. మల్లన్న కార్యాలయంలో ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో జాగృతి కార్యకర్త సాయికి బుల్లెట్ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు